మత్స్యపురిలో జనసేన పార్టీ కట్టించిన నూతన గృహాన్ని ప్రారంభించిన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్

వీరవాసరం మండలం, మత్స్యపురి గ్రామంలో జనసేన పార్టీ కట్టించిన నూతన గృహాన్ని ప్రారంభించిన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతూ… వైస్సార్సీపీ రాష్ట్రంలో 3 సంవత్సరాలుగా చేస్తున్న దురాగతాలను దుయ్యబట్టారు. జనాల్ని దోచుకోవడం అనే కార్యక్రమంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారని రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని చెప్పారు. ప్రజా స్వామ్యని కాలరాసి ప్రజలపై దాడులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జనసేన రానున్న రోజుల్లో మరింత బలపడి ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల మన్నలను పొందాలని అన్నారు. మత్స్యపురిలో జనసైనికులతో నిర్మించిన నూతన గృహన్ని ప్రారంభించి జనసేన పార్టీ 5వ వార్డ్ మెంబర్ చింతా అనంతలక్ష్మి కి అందజేశారు. వీరవాసరం మండల అధ్యక్షులు గుండా రామకృష్ణ మాట్లాడుతూ… మత్స్యపురి జనసైనికులు నిర్మించిన గృహం మోడల్ జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇటువంటి గృహాలు పేదలకు ఇచ్చే విధంగా జనసేన కృషి చేయాలనీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి దృష్టికి తీసుకువెళ్లి మేనిఫెస్టోలో వచ్చే విధంగా తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్, కోటికలపూడి గోవిందరావు, వీరవాసరం జడ్పిటిసి గుండా జయ ప్రకాష్ నాయుడు, వెగెసన కనకరాజు సూరి, ఘంటసాల వెంకటలక్ష్మి, బొమ్మిడి నాయకర్, కాట్నం విశాలి, మల్లినిడి బాబి, యిర్రింకి సూర్యరావు, మండల వైస్ ఎంపీపీ అడ్డాల రాము, చిలకపాటి ప్రకాశం, జడ్డు బాబి, కామిశెట్టి హేమంత్, గుండా బాబు, మొఖామట్ల దుర్గా ప్రసాద్, ప్రెసిడెంట్ కారేపల్లి శాంతి ప్రియా, యళ్ళబండి ఇందిర, ఆకుల మౌనిక, జ్యోతి, శ్యామల, మీనా, గవర లక్ష్మి అనిల్, తదితరులు పాల్గొన్నారు.