ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పడాల అరుణ

గజపతినగరం, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అద్భుత విజయాన్ని అందించిన జనసైనికుల గౌరవార్ధం, వారికి అంకితం చేస్తూ నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకను విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిఏసి సభ్యురాలు (మాజీ మంత్రివర్యులు) శ్రీమతి పడాల అరుణ పిలుపునిచ్చారు. గజపతినగరంలో పడాల అరుణ ఇంటి దగ్గర నిర్వహించిన సమావేశంలో పడాల అరుణ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ సభను కార్యకర్తల విజయోత్సవ సభగా అభివర్ణించారు. ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి జనసైనికుడు, వీరమహిళపై ఉందని అన్నారు. జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, క్రమశిక్షణతో పార్టీకి విధేయులై, పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఐక్యంగా ముందుకు సాగుదామని అన్నారు. ఆవిర్భావ సభ విజయవంతం చేయడంలో గజపతినగరం జనసేన క్యాడర్ పాత్ర కీలకమైందని గుర్తు చేశారు. సమావేశం అనంతరం పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జనసేన గజపతినగరం మండల అధ్యక్షులు మునకాల జగన్నాధ రావు, దత్తిరాజేరు మండల పార్టీ అధ్యక్షుడు చప్ప అప్పారావు, గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడు సారథి అప్పలరాజు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాపాక సాయి, ఇట్ల తిరుపతి, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్, రైతు సంస్థల నీటి వినియోగదారుల సంఘం ప్రాజెక్టు కమిటీ డైరెక్టర్, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది, ఐటీ విభాగం కో-ఆర్డినేటర్ బోడసింగి సునీల్, నియోజకవర్గ నాయకులు మండల లక్ష్మనాయుడు, యశ్వంత్, పిట్ట బాలు, శేఖర్, కళ్యాణ్, ప్రశాంత్, అర్జున్, గౌరీ నాయుడు, మండలానికి చెందిన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment