టీచర్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకి మద్ధతుగా పడాల అరుణ

గజపతినగరం, టీచర్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి బ్యాలెట్ నంబర్ 7 పై తం అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసినదిగా మాజీ మంత్రి వర్యులు, జనసేన పార్టీ పిఎసి సభ్యురాలు శ్రీమతి పడాల అరుణ తెలియచేసారు. సోమవారం గజపతినగరం ప్రభుత్వం జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాల సిబ్బందిని కలవటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు, సీనియర్ నాయకులు రాపాక సాయి, ఇట్ల తిరుపతి, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు మామిడి దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు మండల లక్ష్మీనాయుడు, దాసరి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment