2024 ఎన్నికలలో పాడేరు గెలుపు ఖాయం: డా.వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జనసేనపార్టీ అరకు పార్లమెంట్ రీజియన్ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య సమకాలీన ఆదివాసీ ప్రజల స్థితిగతులపై రాజకీయాల ప్రభావం వంటి సమకాలీన గడ్డు పరిస్థితులపై తమ ఆదివాసీ జాతినుద్దేశించి ప్రస్తావించారు. యావత్ ఆదివాసీ సమాజం సంక్షోభంలో ఉంది. ఒక వైపు ఆదివాసీల హక్కులు కాలరాస్తూ చట్టాలకు తూట్లుపొడుస్తూ మనకు రక్షణగా వుండే రాజ్యాంగ పరమైన వ్యవస్థలను స్వయంగా ప్రభుత్వ పాలకులే నిర్వీర్యం చేస్తున్నారు. ఇవాళ గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆదివాసీల సహజ మనుగడ, అస్తిత్వంపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారు. ఇక్కడ ఆదివాసీ ప్రజానీకం ఒక వాస్తవం తెలుసుకోవాలి తప్పదు? భావితరాల భవిష్యత్ కోసం సగటు ఆదివాసీ గా చైతన్యం కావాల్సిన సమయం ఇదే… ఇక విషయానికొస్తే గతంలో పాలించిన టీడీపీ ప్రభుత్వం ఆదివాసీల ఆస్తిత్వంపై గొడ్డలిపోటు వేసిన మొదటి ముద్దాయి. ఇందులో ఎటువంటి సందేహాలు లేవు కానీ ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ కి నమ్మిన ఆదివాసీ ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్న ముఖ్యమంత్రి మాట చాలా చక్కగా నిలబెట్టుకున్నారు. నిజమే ఆదివాసీల గుండెలు ఆగేంత పనిచేశారు. సుమారు ఒక దశాబ్దకాలంగా నమ్మిన ఆదివాసీ ప్రజలకు దక్కిన బహుమానం గత నెల మార్చ్ 24 వ తేదీన అసెంబ్లీలో 32 లక్షల ఆదివాసీ ప్రజలంతా చూసారు. వైస్సార్, వైసీపీ అంటూ పాడేరు నియోజకవర్గం లో రెండుసార్లు అధికారం ఇచ్చాం, కానీ మనం ఎన్నుకున్నది ఆదివాసీ సమాజా అభివృద్ధికి తోడ్పడే అసలైన రాజకీయ వ్యవస్థ కాదని గుర్తించలేకపోయాం. చివరికి ఆదివాసీ ప్రజలకు ఏమి దక్కిందో ఇకపై ఏమి దక్కనుందో ఆదివాసీ ప్రజలు తమకు తాముగా ఆత్మవిమర్శ చేసుకోవాలి.మేము జనసేనపార్టీ నేతగా మా నాయకులతో జనసైనికులతో నియోజకవర్గంలో చాలా మారుమూల గ్రామాలను సందర్శించాం. అక్కడ అనేకరకమైన మౌళికసధుపాయలు కల్పన లేమి చూసాం పరిశీలించాం, కానీ ఆ సమస్యలకు ప్రధాన మూలం ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా గుర్తించాం. ఉదాహరణకు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మల్లిస్తే జబ్బు చేసిన మనిషికి డోలి మోతలతో ఆస్పత్రులకు తరలించడానికి మార్గమధ్యలోనే మరణాలకు ఒక పరోక్ష సంబంధం ఉందనేది వాస్తవమని గ్రహించాం. ఇది రాజకీయంశంగా చూసి ప్రభుత్వ తీరుని విమర్శచేస్తున్నాం. ప్రశ్నిస్తూనే ఉన్నాం, కానీ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధిపై ఉదాసీనత ఎక్కడ కూడా ఇసుమంతైన తగ్గలేదు. ఇంకెలా ప్రభుత్వం నుంచి అభివృద్ధిని కాంక్షిస్తాం. ఇక్కడ మేము ఒక సూక్ష్మ విషయం గమనించాం అసలు అభివృద్ధి ప్రస్థానంలో ఎక్కడో ఉన్నా ఆదివాసీ సమాజానికి రాజ్యాంగపరమైన రక్షణ వ్యవస్థలని నిర్వీర్యం చేస్తే ఆ జాతి ఇంకెప్పుడు అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది. ఇక్కడ పాలక ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని కేవలం విమర్శించడం, ప్రశ్నించడమే మా అభిమతం కాదు మార్పు దిశగా సరైన రాజకీయవ్యవస్తని ఆహ్వానించాల్సిన సమయమిదేనని ఆదివాసీ సమాజానికి చైతన్యం కలిగించడం కూడా మా బృహత్తర బాధ్యతగా భావిస్తాం. ఆదివాసీల ఆకాంక్ష, ఆలోచన తీరు రాజకీయ వ్యవస్థలని ఎంచుకునే క్రమంలో సగటు ఆదివాసీ పరిణితి ఎటువైపు అనేది మేము ఆధివాసి ప్రజలకు సంధిస్తున్న సూటి ప్రశ్న? ఇప్పటికే జీవో నెం 3 కోల్పోయాం డిగ్రీలు, వృత్తినైపుణ్యం సంపాదించిన డిప్లొమా గ్రాడ్యుయేట్స్,రకరకాల గొప్ప చదువులు చదివి ఏ గత్యంతరం లేక చివరికి తెగించి కుటుంబ పోషణ కోసం గతిలేని పరిస్థితుల్లో చట్టవ్యతిరేకమైన పనులకు సిద్ధపడిన ప్రతిభ అవార్డు విజేతలను చూసాం. గమనిస్తూనే ఉన్నాం. తప్పుడు రాజకీయాలకు అందలం ఎక్కించి భావితరాలకు మంచి జరగాలంటే ఎలా కుదురుతుంది? కేవలం జీవో నెం 3 మూలన స్థానికంగానే ఉద్యోగ కల్పనలో మనం ఆదివాసీ నిరుద్యోగ రిజర్వేషన్ కేటాయింపులు కోల్పోయాం. పి.ఈ.ఎస్.ఏ,1/70 వంటి హక్కులకి తిలోదకలిచ్చి నేడు మన ప్రకృతి సంపదపై దోచుకునే బడా బాబులకు గుత్తాధిపత్యం ప్రభుత్వ అంగీకారంతో మనమే ఇస్తున్నాం కారణం ఏమిటి?కేవలం మనకున్న మిడి మిడి జ్ఞానంతో ఒక తప్పుడు రాజకీయ వ్యవస్థని నమ్మడం కారణంగానే మన ప్రకృతి సంపద మన వారసత్వ సంపదకు మనకే బాధ్యత వున్నా కూడా మన నిర్లక్ష్యం కారణంగా వారి చేతుల్లో మన బవితవ్యం పెడుతున్నాం మనం మన భవిష్యత్ తరాలకు రక్షకులమా?లేక భక్షించే వాళ్లకు బానిసలమా?ఏమిటో ప్రతి ఆదివాసి ఆలోచన చెయ్యాలి. సొమ్ము ఒకరిది సుఖాలు ఇంకొకరిదా?ఇది ప్రజారాంజక పాలన అంటారా? మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రస్తుతం ఆధివాసి అస్తిత్వం నిర్వీర్యం చేసి మనల్ని నిస్తేజుల్ని చేసి ప్రభుత్వం ఏమి సాదించాలనుకుంటుంది. ఈ కుట్రలకు గలా కారణాలు ఏమిటి?కేవలం మనల్ని ఓట్లు వేయడానికి మాత్రమే ఉపయోగపడే అత్యంత అసమర్థ ప్రజాలుగానే ప్రతిపక్ష, పాలకపక్షాలు బావిస్తున్నాయ? కేవలం ఓటుబ్యాంక్ రాజకీయాలకోసం రెండు జాతులకు మధ్య వైరుధ్యం పెంచే కుట్రలు చేసినా కూడా మనం కుక్కిన పేనులా పడుండాల?వారి రాజకీయాల లబ్ధికోసం మనల్ని బలి పశువులు చేస్తుంటే గుర్తించిన సగటు ఆదివాసీగా నీ జాతికి నువ్వు ఇచ్చే చైతన్య సందేశం ఏమిటి?వారి అనాలోచిత నిర్ణయాలకు, అధికారదాహానికి మన ప్రజలు, మన భవిష్యత్ తరాలు బలికావాల? ఇటువంటి అంతర్యుద్ధపు వ్యూహాల్ని పసిగట్టలేనివారం కాదు జనసేనపార్టీ నాయకులు. జనసేనపార్టీ నాయకులకు గాని జనసైనికులకు గాని ఆదివాసీ అభివృద్ధిపై సుదీర్ఘప్రణాళికబద్ధమైన నిర్దిష్టమైన ఆలోచన ఉంది. ఈ సందర్బంగా ఆదివాసీ సమాజానికి ఒక స్పష్టమైన విషయం చెప్పదలుచుకున్నాం. పోరాట పటిమ లేని నాయకులు నాయకత్వం చెయ్యలేరు? రాజకీయాలకు పనికి రారు? వైసీపీ పార్టీని అభిమానించే ప్రజలుకానీ,నాయకులుకానీ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ఏ రాజకీయవ్యవస్త ద్వారా ఆదివాసీ సంరక్షణ,సాధికారత,స్వాలంభనతో కూడిన అభివృద్ధికి దోహదపడుతుందో అటువంటి రాజకీయా శక్తిని గుర్తించి తమ ఉన్మాద పార్టీ ప్రేమని పక్కనబెట్టి ఒక ఆదివాసీ గా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇకా వైసీపీ పార్టీ అభిమానులు ,ప్రజలు ఇప్పుడు జనసేనపార్టీ వైపు చూస్తున్నారు వారు కచ్చితంగా టీడీపీ పార్టీకి పూర్తివిరుద్దంగా వున్నారు అలా అని వైసీపీ పార్టీ ని ఇంకోసారి స్వాగతించే ఆలోచనలో వారు అసలే లేరు? జనసేనపార్టీ లో వలసలు పెరగడం సహజం. ఆదివాసీల హృదయాల్లో మొదటి దొంగలు టీడీపీ నాయకులే ముమ్మాటికీ? వైసీపీ పార్టీ ఆదివాసీల ఆలోచనలో లేనే లేదు అంతమయ్యిందని అనుకుంటున్నారు ఇదే వాస్తవం కూడా. రానున్న సమీప 2024లో ఎలక్షన్లో కచ్చితంగా జనసేనపార్టీ గెలుస్తుంది. అందులో పాడేరు నియోజకవర్గం అసెంబ్లీ స్థానం కూడా ఉంటుందని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య అన్నారు.