జనసేన ఆధ్వర్యంలో సుందరపల్లి గ్రామం వంతెనకి పెయింటింగ్స్ మరియు ఫెన్సింగ్

సుందరపల్లి సేవాసమితి & సుందరపల్లి జనసేన పార్టీ తరుపున సుందరపల్లి గ్రామంలో వంతెనకి పెయింటింగ్స్ మరియు వంతెనకి ఇరువైపులా ఫెన్సింగ్ మరియు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రీన్ స్మైల్ నర్సరీ నుంచి మొక్కలు నాటడానికి సహకరించిన కోరుమిల్లి వాస్తవ్యులు వింటి బాబీకి, కార్యక్రమానికి సహకరించిన సుందరపల్లి ఊడిమూడి గ్రామాల జనసేన పార్టీ ఎంపిటిస్సి తాడాల జానకిరామ్ కి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుందరపల్లి గ్రామ జనసైనికులకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.