పాలకొల్లు జనసేన ఆధ్వర్యంలో నిరసన

పాలకొల్లు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంద్ర పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో జనసేన – జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ని పోలీసులు అడ్డగించడం మరియు జనసేన నాయకులు జనసైనికుల అక్రమ అరెస్టుల చేసి, జనసేన నాయకులని విశాఖపట్నంలో ఎక్కడ పర్యటించకుండా నిర్బంధించడానికి నిరసనగా సోమవారం పాలకొల్లు నియోజకవర్గంలో జనసైనికులు భారీ ఎత్తున స్థానిక గాంధీబొమ్మల సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు జనసేన నాయకులు సిద్దిరెడ్డి అప్పారావు, బోనం చినబాబు, అల్లు రాధాకృష్ణ, తులా రామలింగేశ్వరరావు, ఐ.టి కో-ఆర్డినేటర్ సాధనాల దుర్గబాబు, శిడగం సురేంద్ర, కొమ్ముల దినేష్, ప్రేమ్ కుమార్, డేగల సత్తికొండ, నల్లమోతు ప్రసాద్, ఎంపిటిసి మానేపల్లి శ్రీధర్ మరియు ఎర్రంశెట్టి నరసరావు, డేగల సత్తిపండు, బొలిశెట్టి రమేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.