స్టంట్ మాస్టర్ వీరభద్రకి పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో సన్మానం

పాలకొండ, పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయినటువంటి స్టంట్ మాస్టర్ వీరభద్రకి పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో.. సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ… శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం మొట్ట గ్రామం అయినటువంటి మారుమూల ప్రాంతం నుంచి…. మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ చొరవతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన బద్రి.. స్టంట్ మాస్టర్ గా అంచెలంచెలుగా ఎదిగి ఎంతమందికో సినీ పరిశ్రమలో ఆదర్శంగా నిలిచారు. ఈ సన్మానం కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.