అంబేద్కర్ కు పాలకొండ జనసేన ఘన నివాళులు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం రేగులపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్బంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంను ఉద్దేశించి (ఏ ఐ ఎం) అంబేద్కర్ ఇండియా మిషన్ ఇంచార్జ్ వజ్రగడ రవికుమార్ (జానీ) మాట్లాడుతూ నీ కోసం జీవిస్తే నీతోనే జీవిస్తావ్ సమర్థులు మౌనంగా ఉంటే అసమర్థులు రాజ్యమేలుతారు అనే నినాదాలు ఇచ్చినటువంటి డా.బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్త, అంటరానితనం, వివక్షలపై బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు “డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్” 133వ జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళ్ళు భారత దేశం 145 కొట్లా భారతీయ్యుల ప్రజల కోసం తన జీవితాన్ని తన కుటుంబం ని బలి చేసుకోని గొప్ప గొప్ప చదువులు చదివి ప్రపంచంలో నెంబర్ వన్ రాజ్యాంగం రూప కల్పనా చేసినటువంటి మహాన్ భావుడు డా. బి. ఆర్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగమే భారతీయ్యులు కి శ్రీ రామరక్షగా భారతదేశంలో అనేక మతాలు ఉన్నగాని అందరం ఒకటే అనే భావన తో జీవించడం గొప్ప సంతోషకరమైన విషయం అని అంబేద్కర్ గారిని చూడాల్సినది కులం, మతం కాదు వారి ఆశయం, అభిమతం. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు అని జానీ అన్నారు ముందు రోజు అర్థ రాత్రి 12 గంటలు తరువాత బొడ్లపాడు గ్రామంలో అంబేద్కర్ పాటలుతో ఆయన కు ఘనంగా డాన్స్ లతో పుట్టినరోజు శుభాకాంక్షలు జైభీమ్ జైభీమ్ అనే నినాదాలు తో ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో రేగులపాడు (ఏ ఐ ఎం) టీమ్ శ్రీను, చిన్న రాము, పురుషోత్తం, ఉపేంద్ర, శ్రీను, ప్రకాష్, శంకర్, ఎల్ఐజీ రావు, ఉమా శంకర్, రామకృష్ణ, శంకర్, చింటూ, వంశీ, నవీన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.