అమరజీవి పొట్టి శ్రీ రాములుకు పాలకొండ జనసేన ఘననివాళులు
- పాలకొండ జనసేన ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీ రాములుకు మరియు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘననివాళులు
మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, బొడ్లపాడు గ్రామంలో పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి సందర్బంగా పాలకొండ జనసేన ఆధ్వర్యంలో ఆయనకు ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడతూ తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొట్టి. శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన మహాపురుషుడు అలాంటి గొప్ప మనిషి, అమరజీవి త్యాగం చిరస్మరణీయం. పొట్టి శ్రీ రాములు గారు 70వ వర్ధంతి సందర్బంగా వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలానే భారతదేశ తొలి హోమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్బంగా భారతదేశ స్వతంత్రం కోసం ఉక్కు సంకల్పంతో పోరాటం చేసి ఉక్కు మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన భారతదేశ ప్రజలు కోసం నిజాయితీగా ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు అని జనసేన జానీ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బొడ్లపాడు గ్రామ ప్రజలు చిన్నా, పెద్ద ప్రజలు అందరూ పాల్గొని ఘన ఘననివాళులు అర్పించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-15-at-6.18.08-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-15-at-6.18.07-PM.jpeg)