టీం పిడికిలి పోస్టర్లను ఆవిష్కరించిన పాలకొండ జనసేన

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో టీమ్ పిడికిలి రైతు భరోసా యాత్ర పోస్టర్లను జనసేన నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎన్ని రాజు ఆవిష్కరించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం కోసం అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఇస్తూ.. ఆ కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని కల్పిస్తూన్నారు. గత టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చెయ్యలేని పనిని చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజల్లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టింది ఈ రైతు భరోసా యాత్ర అని జనసేన నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎన్ని రాజు అన్నారు.

జనసేన పార్టీ ఎన్.అర్.ఐ విభాగం జనసైనికుడు రాజా మైలవరపు ఆధ్వర్యంలోని టీం పిడికిలి వారు రూపొందించిన జనసేన పార్టీ రైతు భరోసా పోస్టర్లను రాష్ట్రంలోని 175 నియోజక వర్గాలకు పంపిచండo జరిగింది. అదేవిధంగా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జనసేన పార్టీ నాయకులు టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ మత్స పుండరీకం ఆధ్వర్యంలో రైతు భరోసా యత్ర పోస్టర్ ఆటోలకు, గొడలకు అతికించారు. ఈ కార్యక్రమంలో టీమ్ పిడికిలి నియోజకవర్గ సభ్యులు పోరెడ్డి ప్రశాంతి, పొట్నూరు రమేష్, గొర్ల మన్మధ, కడగల హరికృష్ణ, కర్ణేన పవన్ సాయి, బి.పి.నాయుడు, కంటు మురళి, వావిలపల్లి నాగభూషన్ తదితర నియోజకవర్గం జనసైనికులు పాల్గొన్నారు.