శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి తీర్థ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పాలవలస యశస్వి
కొత్తవలస మండలం, పాత సుంకరపలెం గ్రామములో బుధవారం రాత్రి శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా.. జనసేన పార్టీ ఆధ్వర్యములో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమము పెడిరెడ్ల రాజశేఖర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మరియు జనసేన ఎస్ కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు హాజరయ్యారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనానంతరం కార్యక్రమములో జనసైనికులను ఉద్దేసించి మాట్లాడుతూ.. జనసైనికుల ఐక్యతతో మరిన్ని దైవిక కార్యక్రమాలు చేయాలన్నారు. I కార్యక్రమములో జనసేన నాయకులు నక్కరాజు సతీష్, విగ్రహ ప్రతిష్టాపకులు రము తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-27-at-2.06.02-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-27-at-2.06.01-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-27-at-2.06.01-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-27-at-2.06.00-PM.jpeg)