కొత్తకోటి ప్రసాదు ఆధ్వర్యంలో పాలవలస యశస్వి జన్మదిన వేడుకలు

అంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, అంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు ఉపాధ్యక్షుడు, జనసేన పార్టీ గుంటూరు నగర కార్యదర్శి కొత్తకోటి ప్రసాదు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తూర్పు కాపు సంఘం వారు సహకారంతో గుంటూరు నగరం బ్రాడిపేట 2/13 వ లైన్ నందు శ్రీ షిర్డీ సాయి ధీనజన సేవాసమితి నందు అంధులు, వికలాంగులు, పిల్లలకు పండ్లు వగైరాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా, వారి భవిష్యత్తు కాలంలో ఇంకా ఎన్నో పదవులు అధిరోహించి, క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తూర్పు కాపు అధ్యక్షుడు అబోతుల రామారావు, నగర ప్రధాన కార్యదర్శి వంజరపు దేవి ప్రసాదు, జిల్లా నగర కమిటీ సభ్యులు రేజేటీ శేఖర్, రేజేటి మణి కంఠ, రేజేటి రాజి మరియు జనసేన పార్టీ నాయకులు చిలకల శివ ప్రసాద్, నల్లిభోయిన అనిత, నోరి పార్థసారథి గారు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment