పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 29వ రోజు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా మూడో విడతలో భాగంగా తిమ్మాజిపెట మండలంలో 29వ రోజు సోమవారం ఎదిరెపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ, మండల, నాయకులు జనసైనికులతో కలిసి వంగ లక్ష్మణ్ గౌడ్ గ్రామంలో పర్యటించారు.

గ్రామంలోని ప్రజల ప్రధాన సమస్యలు
• డబల్ బెడ్ రూమ్ లు ఇస్తానని మోసం చేసారు.
• గ్రామంలో సీసీ రోడ్లు లేవు, పింఛన్లు అందటం లేదు, నల్లా లేవు.
• రైతులకు రుణమాఫీ, దళితబంధు లేదు, యువతకు ఉద్యోగాలు లేవు.
• రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు అయింది. స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత మాకు గూడు ఉంటుంది. పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి, మన బతుకులు బంగారుమయవుతాయని అనుకుంటే ఈ ప్రభుత్వంలో మాకంటూ ఏమి లేదు. అంటూ గ్రామస్థులు లక్ష్మణ్ గౌడ్ తో వారి యొక్క సమస్యలను మొరపెట్టుకున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు వంగ విజయ్ భాస్కర్ గౌడ్, సత్యం, సూర్య, వంశీ రెడ్డి, నవీన్, ఎడ్ల ప్రసాద్, పూస శివ, ఎడ్ల రాకేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.