వాలంటీర్ వ్యవస్థ వల్ల పంచాయితీ రాజ్ వ్యవస్థ పతనమైంది

  • నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తర్వాత అధికార కేంద్రంగా మారిన వాలంటీర్ వ్యవస్థ
  • డమ్మీలుగా మారిన సర్పంచ్ లు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, జడ్.పి.టి.సి.లు.
  • సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గనాయకులు బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి: సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చినట్లుగా.. వాలంటీర్ వ్యవస్థ వల్ల పంచాయితీ రాజ్ వ్యవస్థ పతనమైందని సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గనాయకులు బొర్రా వెంకట అప్పారావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి గారు చాలా స్పష్టంగా చెప్పుతున్నారు. ఏమి అని గ్రామ వాలంటీర్లు వైస్సార్ పార్టీ కార్యకర్తలు, సైనికులు కూడా అని. అది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు, ఎమ్మెల్యేలకు తెలిసి ప్రెసిడెంట్ సుబ్బయ్య గారిని అడిగి మేము గ్రామ వాలంటీర్స్ ని పెట్టాము. మీరు చెప్పీన వాళ్లనే కాదా మేము పెట్టింది అని, ఇప్పుడు వాళ్ళు మీ మాట వినటం లేదు అని అంటున్నారు. వాలంటీర్లు ని మీరు గ్రిప్ లొ పెట్టుకోని వాళ్లతో పని చేఇంచుకోండి అని. వాలంటీర్లు వైస్సార్ పార్టీకి వ్యతిరేకంగా పని చెస్తే చెప్పండి వాళ్ళను తీసివేసి కొతవారిని పెడతాం అని చెప్పారు. కానీ అది నిజం అనుకున్న ప్రెసిడెంట్ సుబ్బయ్య గారికి, గ్రామ వైస్సార్ పార్టీ నాయకులకు గ్రామ వాలంటీర్స్ ని పెట్టె వరకు అర్ధం కాలేదు పాపం. పెట్టిన తరువాత అర్ధం అయింది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ ప్రెసిడెంట్స్, వార్డ్ మెంబెర్స్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కి లోకల్ బాడీస్ కి రాజ్యాంగంలో కల్పించిన హక్కులని కాల రాశారు అని. ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి ఎన్ని ఎన్నో హామీలు ఇచ్చి రోడ్స్, డ్రైనేజీ, వీధి దీపాలు, పోల్స్, పొలాలకు డొంక రోడ్లు, బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు కమ్మ్యూనిటీ హాల్స్, ఇరిగేషన్ కాలువలు చేస్తాము అని హామీలు ఇచ్చి గెలిచిన గ్రామ ప్రెసిడెంట్లు, వార్డ్ మెంబెర్స్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అధికారం ఉండి ఏమి చేయలేని నిస్సహాయులుగా, ఉత్సవ విగ్రహలుగా మిగిలిపోయారు. కనీసం ఈరోజు గ్రామలలో నాయకత్వం నిర్వర్యం ఐపోయింది. మనం పార్టీ కోసం ఏమి పని చేసిన ఉపయోగం ఏంటి అనే నిరాశ, నిస్పృహలోకి స్థానిక నాయకత్వం వెళ్ళిపోయింది. ఆరోజు టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వారు జనాలను ఎవిదంగా అణచివేసి పెత్తనం చేసారో. ఈరోజు ఈ గ్రామ వాలంటీర్స్ కొంతమంది వారికి కేటాయించిన 50 ఇల్లులు మీద నిఘా పెట్టి వాళ్ళ సొంత విషయలలో, జోక్యం చెసుకుంటూ పేద ప్రజలను, మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తునారు, మీ ఆధార్, మీ రేషన్ కార్డు, మీ పేక్షన్, మీ పాసుబుక్, హోసింగ్ లోన్, ఏ సహాయం కావాలి అన్నా మేము చెప్పినట్టు చేయాలి అని చెపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు మరియు ప్రేసిడెండ్, వార్డ్ మెంబెర్స్, వైస్సార్ నాయకులు ఎవరు చెప్పినా మేము చేయము, వాళ్లకు మా మీద ఎలాంటి హక్కు లేదు, మీరు మా మాట వినాల్సినదే అని బెదిరిస్తున్న మాట వాస్తవం కాదా ప్రెసిడెంట్ సుబ్బయ్య, వార్డ్ మెంబెర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వైస్సార్ పార్టీ నాయకులారా మిత్రులారా! ఇది నిజం కాదా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి గ్రామంలో జరుగుతుంది ఇది కాదా. మిత్రులారా మీ గుండెల మీద చేయి వేసుకొని మనస్ఫూర్తిగా, మనసాక్షి ఆలోచించండి. మీ మీ గ్రామలలో జరుగుతుంది ఇదే నా కాదా చెప్పండి. మీ మాట వినే వాళ్ళు ఎవరు ఐనా ఉన్నారా, మీ మాటకు ఈ ప్రభుత్వం లో ఏమి ఐనా విలువ ఉందా. ప్రేసిడెంట్ సుబ్బయ్య గారు మీరు సొంతగా మీ ఊరిలో మీరు బ్లీచింగ్ పౌడర్ చల్లిఒచగలరా, విధి దీపాలు వేయంచగలరా, లేక మీరు మీకు ఉన్న హక్కులు ప్రకారం ఈ దేశం లో దేశ ప్రధాన మంత్రి కి కూడా లేని హక్కు చెక్ పవర్ మీకు ప్రెసిడెంట్ గా ఉంది మీరు ఇప్పుడు ఒక చెక్ మీద సంతకం పెట్టగలరా మీ వి.ఆర్.ఓ గారిని ఒప్పించి. పెట్టలేరు మీరు చెప్పుకోవటాని ఈ గ్రామానికి ప్రెసిడెంట్ మాత్రమే సుబ్బయ్య గారు. మీతో ఏమి పని జరుగదు అని మీ ఊర్లో ఉన్న మీరు పెట్టిన వాలంటీర్ చెపుతున్నాడు సుబ్బయ్య గారు. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినపుడు సుబ్బయ్య గారు చాలా తెలివిగా, ముందు చూపుతో, గ్రామ రాజకీయాలలో ఉన్న అనుభవంతో ఎమ్మెల్యే గారికి చెప్పారు కానీ ఆరోజు సుబ్బయ్య గారి మాట పెడచెవిన పెట్టి వినలేదు. ఐనా మరలా ఒక్కసారి అప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రి గారు ఐన అంబటి రాంబాబు గారికి చెప్పి వాలంటీర్ ని మార్చ మని అడగండి. ఏమి చేప్తారో చూద్దాం. ఇప్పుడు వాలంటీర్ ని మార్చటం ఆయన వల్ల అన్నా అవుతుందో లెదో మరి. తొండ ముదిరి ఊసరవెల్లి ఆఇంది కాదా పాపం. సుబ్బి పెళ్లి వెంకీ చావుకి వచ్చినట్టుందే. వాలంటీర్ వ్యవస్థ అనే ప్రయాగం శాలలో. ప్రేసిడెంట్ సుబ్బయ్య(పంచాయతీ రాజ్ వ్యవస్థ) పదవికి ఉన్న పరువు, ప్రతిష్ట మసకబారి, వినాశనం ఐపోయింది. దీనికి కారణం సుబ్బయ్య గారు మాత్రం కాదు. సుబ్బయ్య గారు తనకు ఉన్న అనుభవం తో చెప్పీనా వినని వారిది తప్పు. కాబట్టి వీరి అవివేకానికి పేద ప్రజలు, మహిళలు, వృద్ధులు, అవిటి వారు, వికలాంగులు అందరు, అణచివేతకు, అబద్రతాభావానికి, ఆందోళనకు, భయబ్రాంతులకి గురి అవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి పునరాలోచన చేయాలి. అలానే ఇప్పుడు డిగ్రీ లు చదివి, ఎంతో యువశక్తి, అపారమైన తెలివితేటలూ ఉన్న యువతకు 5,6, వేల రూపాయల వెల కట్టి వాళ్ళను వాలంటీర్లు గా పని చెపిస్తున్నారు. వారి భవిష్యత్తు ని పాడు చేస్తునారు. వారి చదువు కు తగ్గ ఉద్యోగ అవకాశం కల్పించాలి అని ప్రజల అందరి మనవి, వాలంటీర్స్ అందరిని తప్పు పట్టటం లేదు. కొంతమంది వేరే మార్గం లేక, ఉద్యోగ అవకాశం లేక వాలంటీర్లు గా పని చేస్తునారు, కొందరు చేసే తప్పు వలన అందరికి ఇబ్బంది వస్తుంది ఏది ఎమి ఐనా వారి చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి అని ప్రజల అందరి తరఫున వెంకట అప్పారావు మనవి చేసారు.