పద్మ విభూషణ్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేసిన పండ్రా రంజిత్

కడప: సినీ నటుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ మెగాస్టార్ చిరంజీవిని హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అవార్డు వచ్చిన సందర్భంగా మెగా అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులును ఆప్యాయంగా పలకరించి పండ్రా రంజిత్ కుమార్ కడపలో చేస్తున్న రక్తదాన శిబిరాలు మరియు పలు సేవా కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకొని అతనిని చిరంజీవి అభినందించడం జరిగింది.