విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, తిమ్మాపురం గ్రామంలోని జనసేన పార్టీ వీరమహిళ శ్రీమతి రాజేశ్వరి తాత, పాఠశాల భూదాత నరసింహారావు తనయుడు గంగాధర్ నాయుడు జయంతి సందర్బంగా స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, వాటర్ బాటిల్, స్వీట్స్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ చేతులమీదుగా అందించడం జరిగింది. ఆ మహాదాతల విగ్రహాలకు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తాతాజీ, దుర్గబాబు, కుమారి, లోవబాబు, బుజ్జి, మరియు శిరీష, శిరంగు శ్రీను, తాటికాయల వీరబాబు, ఆకుల మని, సంతోష్, సునీల్, జగన్ తదితరులు పాల్గొన్నారు.