దేవిక కుటుంబాన్ని పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడ మధ్య రహదారిలో ఇటీవల ప్రేమోన్మాది.. దేవిక అనే అమ్మాయిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించి, నేడు గంగవరం గ్రామంలో ఉన్న దేవిక తల్లిదండ్రులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెలుబంట్ల సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.