బీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ మాట్లాడుతూ బీఎంపీలు గా మీరు గ్రామాల్లో చేస్తున్న సర్వీస్ కి అభినందనలు తెలిపి, రాష్ట్ర వ్యాప్తంగా మీకు గల ఇబ్బందులను, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తానని పంతం నానాజీ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పెద్దలు, బీఎంపీ లు తదితరులు పాల్గొన్నారు.