రెండేళ్ల తర్వాత పాపికొండల యాత్ర.. మళ్లీ ప్రారంభం

గోదావరి నదిలో పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లాలోని గండిపోచమ్మ బోట్ పోయింట్ దగ్గర రెండు పర్యాటక బోట్లను జెండా ఊపి ప్రారంభించారు మంత్రి శ్రీనివాసరావు. రాబోయే రోజుల్లో పోలవరం ప్రాంతాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

2019లో కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత ఈ యాత్రను నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. మళ్లీ ఇన్నాళ్లకు అనుమతినిచ్చింది. విహారానికి కేవలం 11 బోట్లకు మాత్రమే ఓకే చెప్పింది. వాటిలో 2 టూరిజం బోట్లు, 9 ప్రైవేట్‌ బోట్లు ఉన్నాయి.