వైద్య సేవకులను ఆరోగ్య కార్యకర్తలను కొనసాగించాలి

వంపూరు గంగులయ్య సమక్షంలో జనసేనలో చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల పాడేరు ఐటిడిఏ పరిధిలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత 15సంవత్సరాల నుండి విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్య సేవలను ఆరోగ్య కార్యకర్తలుగా అందించడం జరిగింది. ఈ ఆరోగ్య కార్యకర్తలకు గత 2019 విద్యా సంవత్సరంలో (కరోనా) కోవిడ్ సెలవులనుండి విధులనుండి తొలగించి యున్నారు. ఇప్పటి వరకు ఆశ్రమ పాఠశాలలో ఆరోగ్య కార్యకర్తలు లేక విద్యార్థుల ఆరోగ్యాలపై కనీస రక్షణ లేని పరిస్థితి ఎదురౌతుంది. దీనిపై అధికారులు బాధ్యతలు తీసుకోక విద్యార్థుల ఆరోగ్యాలు మరియు ఎన్నో ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. గతంలో పని చేసిన ఆరోగ్య కార్యకర్తలకు వారి యొక్క 4నెలల బకాయి జీతాలు కూడా ఇప్పటికి ఇవ్వకపోవడం దురదృష్టకరం. విధులనుండి తొలగించడం వలన వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. వసతి గృహలలో విద్యార్థిని, విద్యార్థుల మరణాలు వైద్య సేవలు లేకపోవడం వలనే మరణాలు జరుగుతుందని అంశాలను గుణపాఠంగా తీసుకొని మరణాల నివారణకు వైద్య సేవకులను, ఆరోగ్య కార్యకర్తలను కొనసాగించాలి అనే అధికారులు ఆలోచన చేయకపోవడం బాధాకరం మరణాల నిర్మూలనకు మరియు వైద్య సేవకుల ఉపాధి అవకాశాలు కొనసాగింపునకు దోహదపడే విధంగా పాఠశాలలలో ఆరోగ్య సేవకులను కొనసాగించుటకు విజ్ఞప్తి చేయుచున్నాము. ఈ కార్యక్రమం అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా.వంపూరు గంగులయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. తదనంతరం పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశం సందర్బంగా పాడేరు మండలనికి చెందిన ముంచంగి పుట్టు పంచాయతీకి చెందిన జంగిడే మత్య రాజు, జంబు మహేష్, మాతే ప్రసాద్, మాతే అర్జున్, మరియు కుజ్జేలి పంచాయతీకి చెందిన గబ్బడా సింహాచలం, మరి కొంతమంది జనసేన పార్టీ సిద్ధంతాలు, ఆశయాలకు ఆకర్షతులై సమాజంలో మార్పు కొరకు పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈ రాష్ట్రానికి దిశ, దశ చూపించగలరని నమ్మకంతో అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా.వంపూరు గంగులయ్య సమక్షంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు మండల శాఖ అధ్యక్షులు మురళి కృష్ణ, జి మాడుగుల మండలశాఖ అధ్యక్షులు మసాడి భీమన్న, తెరవాడ వెంకట రమణ వివిధ మండలాలకు సంబంధించిన ఆరోగ్య కార్యకర్తలు, అశోక్, పాంగి సురేష్, మజ్జి సంతోష్ తదితరులు పాల్గొవడం జరిగింది.