42వ డివిజన్ లోని పార్క్ పేరు మార్చాలి: జనసేన డిమాండ్

  • పార్కుకి గతంలో ప్రకటించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరును తొలగించడం సమంజసమేనా
  • భారతరత్న దేశ మాజీ ప్రధానికి పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా..?
  • ప్రశ్నించిన పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పోతిన మహేష్

విజయవాడ వెస్ట్: పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ న్యూ ఎం.ఐ.జిలో పార్కుకి గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరుతో నామకరణం చేసి కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు ఈ పార్క్ కి వైఎస్ఆర్ ఉద్యానవనం అని పెట్టడం ఎంతవరకు సమంజసం..? భారతరత్న దేశ మాజీ ప్రధానికి పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా..? నిస్వార్థపరుడుగా దేశానికి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి పేరు తీసేయటం చాలా దుర్మార్గమని
దీనిని జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పోతిన మహేష్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. పిల్లలందరూ ఆడుకొనే పార్కులో రాజకీయ పార్టీ విగ్రహాలు పెట్టడం ఎంతవరకు సబబు?. దేశం కోసం పోరాటం చేసిన స్వతంత్ర సమరయోధులు విగ్రహాలు పెట్టండి. రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహానికి మీ వ్యతిరేకరం కాదు పక్కన రోడ్డులో ఒక విగ్రహం పది రోజులకు క్రితం ప్రారంభం చేశారు కదా.. ఇంకా ఎన్ని పెడతారు వెల్లంపల్లి శ్రీను గారు? ఇదంతా కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. ఈ పార్క్ కి వెంటనే పేరు మార్చాలి అదేవిధంగా పార్కులో విగ్రహాన్ని తొలగించాలని పోతిన మహేష్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.