ఓటరు జాబితా అవగాహన సదస్సులో పాల్గొన్న జనసేన నాయకులు

పుంగనూరు నియోజకవర్గం: పుంగనూరులో ఎమ్మార్వో సీతారాం సమక్షంలో అఖిలపక్ష పార్టీల నాయకులతో ఎమ్మార్వో జరిపిన సమావేశంలో ఓటర్ల జాబితాపై అవగాహన మరియు బి.ఎల్.ఓ లతో కలసి ఓటర్ల మార్పులు చేర్పులు, అలాగే దోంగ ఓటర్లను గుర్తించటం లాంటి అంశాల గురించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున పుంగనూరు టౌన్ అధ్యక్షులు గాజుల నరేష్ రాయల్, జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు ఆవుల చైతన్య రాయల్, పుంగనూరు నియోజకవర్గ ఐటీ ఇంచార్జీ దేశాది వికాస్, బాలాజీ నాయక్ లు పాల్గొన్నారు.