జనసైనికులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది: డా. పసుపులేటి

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలోని యువకులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనుమ పండుగ సందర్బంగా ఎద్దులు తరీమే కార్యక్రమంలో జనసేన టీ షర్ట్లు వేసుకొని జనసేన నినాదాలు చేస్తున్న జనసైనికులపై అక్కడ ఉన్న కొంతమంది పోలీసులు వారిని బెదిరించి వేసుకున్న టీ షర్ట్ తీసేవరకు కొట్టి, వారిపై అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా నాయకులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఈ ఘటన ను తీవ్రంగా ఖండించి, యువకులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని దైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.