డిజిటల్ క్యాంపెయిన్ లో పార్వతీపురం జనసేన

జనసేనాని పిలుపు మేరకు రోడ్ల పరిస్థితి పై #GoodMorningCmSir ప్రోగ్రాంను పార్వతీపురం జనసేన నాయకులు నిర్వహించడంజరిగింది.

పార్వతీపురం నియోజకవర్గం, మండలంలో గల అతిపెద్ద పంచాయతీ అయిన నర్సిపురం-వెంకటరాయుడు పేట రోడ్ పరిస్థితి దయనీయంగా ఉండి రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని వాపోయారు. కార్యక్రమంలొ భాగంగా నియోజకవర్గ నాయకులు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. జూలై 15 నాటికి రోడ్లపై గుంతలు ఉండవు అన్న ఓ సీఎం సారూ..! మీ మాట తప్పని తనం మీ మడమ తిప్పని తనం ఏమైంది అని చమత్కరించారు. అప్పులు చేసి నవరత్నాలు పంచి ఓట్ బ్యాంకు రాజకీయం మాని ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మీద దృష్టిపెట్టాలని పిలుపునిస్తూ.. కేంద్ర ప్రభుత్వఒ రోడ్లకని మంజూరు చేసిన నిధులు ఎంత ??? మీరు వేసిన రోడ్స్ ఎన్ని ??? అని ప్రశించారు.. రాష్ట్రములో దాదాపుగా ఇదే దయనీయమైన పరిస్థితి రోడ్లమీద ఉంది. ప్రజలు ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేసి ప్రాణాలు కోల్పోతుంటే మీకెందుకు పడుతుంది లెండి సారూ.. మీరు ఎపుడన్నా రోడ్ మీదకు జనాల్లోకి వస్తేనే కదా ??.. రోడ్డులే వేయటం చేతకాని ముఖ్యమంత్రి జిల్లాకొక ఎయిర్పోర్ట్ కడతామనటం హాస్యాస్పదమని.. ఇప్పటికన్నా ప్రభుత్వం రోడ్లని బాగుచేయాలని, కొత్తవాటి నిర్మాణం చేయాలి అని కోరారు. నిజమైన గ్రామ స్వరాజ్యం గాంధీ వాదాన్ని అలవర్చుకున్న జనసేనాని వలెనే సాధ్యం అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జనసేన నాయకులు ఆగూరు శ్రీను, ఖాతా విశ్వేశ్వర రావు, కర్రి మణికంఠ మరియు నర్సిపురం జనసైనికులు రాజు, రవి, దుర్గ, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.