మహనీయుడు అంబేద్కర్ కు నివాళులు అర్పించిన పార్వతీపురం జనసేన

పార్వతీపురం, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటూ పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మండల పరిధిలో నర్సిపురం గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జనసేన నాయకులు నివాళులు అర్పించారు. మండల అధ్యక్షురాలు ఆగురు మణి మాట్లాడుతూ అంబేద్కర్ దూరదృష్టితో ప్రజలకు స్వేచ్చ, హక్కులు అవసరమని భారత రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. అందరికీ సామాజిక న్యాయం జరగాలని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో పొందుపర్చారని, చట్టాన్ని చేయటం గొప్పకాదు దానిని అమలుచేయటమే గొప్ప విషయమని ఆనాడే ఆయన చెప్పటం జరిగిందని చెప్పారు. ప్రజలు తన హక్కులు పొరడానికి ఓటు అనే ఆయుధం ఇచ్చాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో భారత రాజ్యాంగం అమలు కాకుండా ఫాసిజం సిద్ధాంతాలను అమలు చేస్తోంది ఈ ప్రభుత్వము అని మండి పడ్డారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినట్టు చేశారనీ, బాబా సాహెబ్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి అనుకునే వాళ్ళు అంతా ఒకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాలని పిలుపు నిచారు. జనసేన పార్టీ బాబా సాహెబ్ ఆలోచన, ఆశయ సాధన దిశగా బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడుతుంది అని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అగురు మణి, బొనెల గొవింధమ్మ, రాజాన బాలు, ఖాతా విశ్వేశ్వరరావు, గుంట్రేడ్డి గౌరీశంకర్, పైల రాజు, పవన్, నూకరాజు, బోండపల్లి జనార్ఠన్ రావు, అన్యబత్తుల దుర్గ ప్రసాద్, రవికుమార్, తేజ, పవన్, లక్ష్మణ్, ప్రవీణ్, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.