పార్వతీపురం జర్నలిస్టు ఫోరం ప్రెస్ క్లబ్ ఏర్పాటు!

  • ఏకగ్రీవంగా ఎన్నికైన తాత్కాలిక బాడి
  • గౌరవ అధ్యక్షులుగా వంగల దాలి నాయుడు
  • అధ్యక్షులుగా ఎస్.నూకరాజు
  • వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రముఖ చిత్రకారుడు, సినీ రచయిత తుంబలి శివాజీ

పార్వతీపురం: పార్వతీపురం జర్నలిస్ట్ ఫారం ప్రెస్ క్లబ్ శుక్రవారం ఏర్పాటయింది. పార్వతీపురం మన్యం జిల్లా విలేకరుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన సమావేశంలో జిల్లాలోని విలేకరులు పిజెఎఫ్ ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటులో భాగంగా పలు తీర్మానాలను చేశారు. ఇందులో భాగంగా తాత్కాలికి బాడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ వంగల దాలి నాయుడు (పబ్లిక్ న్యూస్ రీడర్, ఆంధ్రభూమి, ఉత్తరాంధ్ర న్యూస్ స్టాఫ్ రిపోర్టర్), వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రముఖ చిత్రకారుడు, సినీ రచయితతుంబలి శివాజీ (మోక్షం), అధ్యక్షులుగా ఎస్. నూకరాజు (వార్తావళి), జనరల్ సెక్రటరీగా టి.రామ్మోహన్ రావు (ప్రజా ప్రతినిధి) ఉపాధ్యక్షులుగా టి.రామారావు (6 టీవీ), ఎం. రామకృష్ణ ( ఉత్తరాంధ్ర న్యూస్, జాయింట్ సెక్రెటరీలుగా ఎం.శ్రీనివాస కళాధర్ ( ఉత్తరాంధ్ర న్యూస్), ఎస్.సతీష్ (మెట్రో న్యూస్), ట్రెజరర్ గా జె.ఉపేంద్ర (మెట్రో ఉదయం), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎస్. శివప్రసాద్, పి. నాని బాబు, రాంప్రసాద్, ఎం.రాము, కె.ఉదయభాస్కర్, ఎం.నరేష్, బి.శంకర్రావు, ఎన్. బాలాజీ, పి. శ్రీను, జి.తేజ, పి. ప్రేమానంద్, ఎం.నరేష్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు తాత్కాలిక బాడీగా పని చేస్తారని తీర్మానించారు. దీంతోపాటు 15 తీర్మానాలను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిలో భాగంగా పిజెఎఫ్ ప్రెస్ క్లబ్ నిర్మాణం గురించి జిల్లాలోని జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ఆయా ప్రాంతాల పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రతి ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలపై చర్చించాలని, అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు తదితరవి వెలికి తీసి ప్రజాపక్షాన గొంతుకు వినిపించాలని, పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని, చిన్నా, పెద్ద, పేపర్ తేడా లేకుండా జూనియర్, సీనియర్ బేధం లేకుండా వచ్చిన వారిని చేర్చుకోవాలని ఇలా పలు తీర్మానాలను చేసి పిజెఎఫ్ ప్రెస్ క్లబ్ ఆమోదించింది. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.