పార్వతీపురానికి “రింగ్ రోడ్డు” అవసరం ఉంది

  • రింగ్ రోడ్ ఏర్పాటు చేసి భారీ వాహనాలను మళ్లించి ఆక్సిడెంట్లు నియంత్రించండి
  • అధికారులు కళ్ళు తెరిచి ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ సమస్య అరికట్టండి
  • పార్వతీపురం పట్టణానికి సంబంధించి ట్రాఫిక్ పెరగడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పట్టణానికి “రింగ్ రోడ్” అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నా జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పార్వతీపురం పట్టణానికి సంబంధించి ట్రాఫిక్ పెరగడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పట్టణానికి “రింగ్ రోడ్” అవసరం ఉందని జనసేన పార్టీ నాయకులు చందక అనీల్, రాజాన రాంబాబు, నెయ్యిగాపుల సురేష్, సిరిపురపు గౌరీ, మానేపల్లీ ప్రవీణ్, హర్ష, గోపీసెట్టి రంగా రావు తదితరులు పట్టణ ప్రజలు తరుపున పత్రికా ముఖంగా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెహికల్స్ పెరగడంతో బైపాస్ రోడ్ ఫ్లైఓవర్ నుంచి పాత బస్టాండ్ అలాగే రాయగడ రోడ్ వైపుగా అన్ని భారీ వాహనాలు వెళ్లడంతో చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఈమధ్య చాలా ఆక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా మనం చూసాం. అదేవిధంగా మన్యం జిల్లా కావడంతో చుట్టుపక్క ఉన్న మండలాలకు సంబంధించి పట్టణాలకు సంబంధించినవాళ్ళ అలాగే వ్యక్తిగత పనుల గురించి చాలామంది పార్వతీపురంలోకి వచ్చి పోవడం జరుగుతున్నాయి. దానివల్ల ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ సమస్య అలాగే గుర్తించని చిన్న చిన్న ఆక్సిడెంట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని పార్వతీపురానికి ఒక “రింగ్ రోడ్” అవసరం ఉందని చెప్పి జనసేన పార్టీ నుంచి వారు డిమాండ్ చేశారు.