పార్వతీపురం గ్రామ దేవత బైక్ స్టిక్కర్లు ఆవిష్కరణ

పార్వతీపురం గ్రామదేవత “శ్రీ ఇప్పలపొలమ్మ తల్లి” అమ్మవారి పండగ సందర్భంగా “ఇప్పలపొలమ్మ సమైఖ్య కమిటీ” సభ్యులు చందక అనీల్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు గోర్లి వెంకటరమణ, బెలగాం జయప్రకాష్ చేతులు మీదుగా అమ్మవారి బైక్ స్టిక్కర్స్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం పట్టణ గ్రామ దేవత శ్రీ ఇప్పల పోలమ్మ పండుగను మే నెల 28, 29, మరియు 30 తేదీల్లో జరిపేందుకు పెద్దలు కమిటీ సభ్యులు నిర్ణయినంచడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో పండగ ప్రచారం నిమిత్తం బైక్ స్టిక్కర్లను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పల పోలమ్మ సమైక్య కమిటీ సభ్యులు చందక శ్రీను, చందక రవి, నెయ్యిగాపుల సురేష్, సొంటెన శ్రీను, వంగల దాలినాయుడు, గునాన నరేష్, చింతాడ ముఖేష్, మండల ప్రసాద్, నెయ్యిగాపుల సంతోష్, సిరిపురపు గౌరీ, సిరిపురపు భాష, మర్రి చంద్ర, సోంటేన మురళీ, రాజాన రాంబాబు, వానపల్లి ప్రసన్న, పతివాడ దుర్గా ప్రసాద్, చింతాడ పవన్, అద్దాల సంతోష్, యెద్దు వాసు, సుంకరి ప్రసాద్, రవణ, పిన్నింటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.