విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్లో పటమట జనసేన

జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ఎంపిలు పార్లమెంట్లో ప్లకార్డ్స్ ప్రదర్శించాలని ఇచ్చిన పిలుపు డిజిటల్ క్యాంపెయిన్ ఉద్యమాన్ని శ్రీ రామాయణపు కోటేశ్వర రావు(నాని) ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవనీయులు శ్రీ పోతిన వెంకట మహేష్ సూచనలతో ఆదివారం పటమట పరిధి ఎన్.టి.ఆర్ సర్కిల్ లో చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాశం సుజాత, సుభాషిణి మేకల, వేమా నాగార్జున, యడ్లపల్లి నాగరాజు, బాబు పోట్ల, ఆదూరి శ్రీనివాసరావు, ఉల్లి విజయ, ఎలిసెట్ట రెడ్డమ్మ మరియు వీరమహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసిన గుడివాడ జనసేన నాయకులు శ్రీ వడ్డాది లక్ష్మీకాంత్ కి ఆకివీడు జనసేన నాయకులు శ్రీ జానకి సుమంత్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.