నిరాశ్రయులని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో ప్రమాదవశాత్తు మూడు ఇళ్ళు కాలిపోవడంతో ఆ ఇళ్లలోని వారందరూ కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. వీరి మూడు కుటుంబాల్లో భర్తలు చనిపోవడం వల్ల మహిళలే కూలి పని చేసుకుని కుటుంబాల్ని పోషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సర్వస్వం కాలిపోయి బూడిద అవ్వడం వల్ల వీరంతా రోడ్డున పడ్డారు, వీరు ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి అందరూ వీరిని ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర కోరటం జరిగింది.