*వేడుకలో పాల్గొన్న కూటమి నేతల
మదనపల్లె తాజ్ హోటల్ అధినేత, తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర హాజ్ కమిటీ డైరెక్టర్, మాజి సర్పంచుల సంఘ అధ్యక్షుడు పటాన్ కాదర్ ఖాన్ జన్మదిన వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత ఈ కార్యక్రమానికి హాజరై ఖాన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “పటాన్ కాదర్ ఖాన్ ఎల్లప్పుడూ సమాజ సేవలో ముందుండే మహానుభావులు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆయన ప్రత్యేకత. ఇటువంటి సేవాభావం కలిగిన నాయకులు సమాజానికి అవసరం,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దారం హరి ప్రసాద్ కూడా పాల్గొని ఖాన్ ని దుస్సాలువతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం సత్సంగతితో, శుభాకాంక్షలతో సాగింది.
Share this content:
Post Comment