ఉంగుటూరు, రంజాన్ మాసం సందర్బంగా శనివారం భీమడోలు మండలం అంబర్ పేట గ్రామంలో నూర్ బాషా సంఘం వారు (ముస్లిం సోదరులు) ఏర్పాటు చేసిన “ఆత్మీయ ఇఫ్తార్ విందుకు” ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు సోదరులు పత్సమట్ల భీమరాజు & గన్ని గోపాలం హాజరయ్యారు. ఈ సందర్బంగా భీమరాజు ఈ పవిత్ర రంజాన్ మాసంలో అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన,టీడీపీ, బీజేపీ నాయకులు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ జనసైనికులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment