బాల్యం రాజేష్ ఇంటికి విచ్చేసిన పత్తి చంద్రశేఖర్, అంబికా లక్ష్మీనారాయణ

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ & జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్ కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ఇంటికి విచ్చేసిన సందర్భంగా ఇంచార్జ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున స్వాగతం పలికి, మర్యాదపూర్వకంగా ఘనంగా సత్కరించి సమావేశం అవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.