కాపు సంక్షేమ సేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా పత్తి చంద్రశేఖర్

అనంతపురం: విద్యావంతుడు, న్యాయవాది, ప్రజా సమస్యల పట్ల అవగాహన మెండుగా ఉన్న పత్తి చంద్రశేఖర్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా క్షేత్రంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా కాపుల సంక్షేమ అభివృద్ధికి కాపులకు సంబంధించి ఏ సమస్యలు ఉత్పన్నమైన తన వాణిని బలంగా వినిపిస్తూ.. అందరివాడిగా నిలిచారు పత్తి చంద్రశేఖర్. ఇదే క్రమంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు హరి రామ జోగయ్య పత్తి చంద్రశేఖర్ సేవలను గుర్తించారు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూ.. తన కార్యవర్గంలో ఇదివరకే స్థానం కల్పించారు. తాజాగా కాపు సంక్షేమ సేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులుగా పత్తి చంద్రశేఖర్ ను నియమించారు. ఈ సందర్భంగా పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరి రామ జోగయ్య తనపై ఎంతో విశ్వాసాన్ని ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పత్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పత్తి చంద్రశేఖర్ కు అభినందనలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.