డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన పత్తి చంద్రశేఖర్

అనంతపురం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేశారు. పూడిచర్ల గ్రామంలో ఫారం పాండ్స్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయనను ఓర్వకల్లు విమానాశ్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ టిసి వరుణ్ తో కలిసి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పుట్టపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ పత్తి చంద్రశేఖర్ ఘన స్వాగతం పలుకుతూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పత్తి చంద్రశేఖర్ ని పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment