పవన్ ‘అయ్యప్పన్ కోషియం’ లేటెస్ట్ అప్ డేట్..!!

మలయాళం ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన “అయ్యప్పన్” కోషియం సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసి మొదటిలో రవితేజతో మరో హీరోతో చేయాలని డిసైడ్ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మాత్రం ఈ సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా తో కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి.ఇదిలా ఉండగా ఈ సినిమాలో సముద్రఖని నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల కన్ఫామ్ చేశారు. ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో. ఆయన మాట్లాడుతూ అయ్యప్పన్ కోషియం సినిమాలో తనని త్రివిక్రమ్ పెట్టుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

అయితే ఎటువంటి క్యారెక్టర్ చేస్తున్నా అన్న దాని విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని పేర్కొన్నారు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురం లో” సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో మెప్పించడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చనువు తోనే “అయ్యప్పన్ కోషియం” సినిమాలో త్రివిక్రమ్ సముద్రఖని ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా పవన్ రీ ఎంట్రీ  మూవీ  “వకీల్ సాబ్” టీజర్ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కావటంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకుంటుంది. టీజర్ లో పవన్ డైలాగులకు అభిమానులు ఫిదా అవుతున్నారు.