పెనుగుదురులో జనం కోసం పవన్-పవన్ కోసం మనం 2వ రోజు

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, పెనుగుదురు గ్రామ అధ్యక్షులు గంట నాని బాబు, మండల అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో రెండవ రోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి.. ఈ గ్రామంలోని పర్యటన చేస్తున్న ప్రజలు వారి సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజలు వివరించిన సమస్యలు దేవాదాయ ధర్మదాయ శాఖ భూములు మరియు పంట కాలువలు అమ్మకాలు!. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి సర్వే నెంబర్లు 23,30 లలో భూమిని కొంతమందికి ఇండ్ల స్థలములు పట్టాలు ఇవ్వడం జరిగింది, ఆ స్థలములు ఇవ్వగా ఆ స్థలములు ప్రక్కన, ఎదురుగా పట్టాలు ఇవ్వని భూమిలు మిగిలి ఉన్నవి, ఆ మిగిలిన స్థలాలను 10మందికి పై చిలుకు ఒకఒక్కరి దగ్గర లక్ష (1,00,000)రూపాయలు చొప్పున పెనుగుదురు వైస్సార్సీపీ నాయకులుదేవాదాయ ధర్మదాయ శాఖ భూములు అమ్మేసారు. అందులో కొనుగోలు చేసిన కొంతమంది కాలువలు కప్పేటిసి ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు, (పంట భూమి ఉండగా) మరి కొంతమంది గృహాలు నిర్మించుటకు పునాదులు వేసాశారు. పెనుగుదురు పంచాయతీ అధికారులు, రెవిన్యూ అధికారులు వైస్సార్సీపీ నాయకులకు భయపడి నిమ్మకు నీరూపెట్టనట్టున్నారు. ప్రభుత్వం ఆస్తులను అమ్మివేసి సిగ్గులేకుండా గుడులు కట్టిస్తున్నాము అంటున్నారు. ఊరిని అభివృద్ధి చేస్తున్నాము అని చెబుతున్నారు. దొంగచాటునా వైస్సార్సీపీ నాయకులు దగ్గర సైట్లు కొన్నవారు కొద్దిమంది పేర్లు: పితాని దుర్గా, కేశవరపు వీరబాబు, సత్తి వెంకన్న, మట్టపర్తి కొండయ్య, గుత్తుల వెంకటరావు, తాతబ్బాయి, నల్లా సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
బావరం 5వ లేఔట్ లో 196 సైట్ లలో 183 పట్టాలు ఇచ్చారు, (13 పట్టాలు వైసీపీ కార్యకర్తలుకు ఇవ్వడానికికో అమ్ముకోవడానికో 13 పట్టాలు ఐతే దాచుకున్నారు).ఆ 183 సైట్స్ లో 30 ఇల్లులు శంకుస్థాపన చేయగా ఒకే ఒక కరెంటు మీటర్ ఇచ్చినారు, ఇది చాలా బాధాకరం & చాలా ఆశ్చర్యకరం గా ఉంది. ఆ ఒక్క మీటర్ తో 30 ఇల్లులు కట్టుకొనే వారు ఒకరు తర్వాత ఒకరు బాధలు పడుతూ వాటర్ పట్టుకోవడం, తడుపుకోవడం చేస్తున్నారు. ఇన్ని బాధలుతో ఒకే ఒక ఇళ్ళు నిర్మించడం జరిగింది. ఆ 30 ఇల్లులు శంకుస్థాపన చేయడానికి కారణం మీరు ఇల్లులు కట్టుకోకపోతే మీ స్థలములు (పట్టాలు)పోతాయి అని బెదిరించి శంకుస్థాపనలు చేయించారు. అక్కడ కనీస అవసరాలు లేవు పల్లపు ప్రాంతం, వాటర్ లేదు డ్రైనేజీ లేవు, రోడ్ లు లేవు ఆఖరికి అందరికి కరెంటుకూడా లేదు. పెనుగూదురులో అతి పెద్ద సమస్య రైస్ మిల్లులో దుగర ఊరు మీద పడడం, ఇంటి పైకప్పులపై పడి ఇల్లులు పాడు అవ్వడం, అది ఒక్కసారి కంటిలో పడడం, ఒక్కసారి బాడ్ స్మెల్ రావడం జరుగుతుంది. దుగరని ఆపాలి అంటే రైస్ మిలర్స్ ఆపవచ్చు అది వాళ్ళకి ఖర్చుతో కూడుకున్నపని అది వారు చేయరు. దీని వాళ్ల ప్రజలు చాలా బాధ పడుతున్నారని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.