పెనుగుదురు గ్రామంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, పెనుగుదురు గ్రామంలో గ్రామ అధ్యక్షులు గంట నాని బాబు, మండల అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి పెనుగుదురు గ్రామ ప్రజలు వారి సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.