సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్

ఆర్టిస్టుగా పవన్ జోరు పెంచారు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ఒక్కొక్కటీ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగును పూర్తిచేసిన పవన్.. ప్రస్తుతం క్రిష్ సినిమా సెట్స్ లో వున్నారు. దీని తరువాత చేయబోయే సినిమాలను కూడా అప్పుడే లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే ఆయా చిత్రాల ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతకుముందే వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం స్క్రిప్టుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డి పవన్ ను కలసి పూర్తి స్క్రిప్టు వివరించాడని, ఆయన ఓకే చెప్పారనీ తెలుస్తోంది. సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక పవన్ సినిమా సెట్స్ కి వెళుతుంది.