పేరు పేరున రిప్లైతో షాక్ ఇస్తున్న పవన్‌!

పవన్ పుట్టిన రోజు హంగామా పూర్తయింది. సెలబ్రెటీలంతా పవన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్లను హోరెత్తించారు. సాదారణంగా ట్విట్టర్ లో అంత యాక్టివ్ గా రియాక్ట్ కాని పవన్ ఈసారి మాత్రం అందరికీ భిన్నoగా కనిపించారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా తనకు ట్విట్టర్లో విషెస్ చెప్పిన ప్రతి సెలబ్రెటీని గుర్తు పెట్టుకుని జవాబు ఇచ్చారు. అవి కూడా మొక్కుబడిగా లేకుండా కామన్ మెసేజ్‌లు పెట్టి ఊరుకోకుండా.. ఒక్కక్కరు విషెస్ చెప్పిన తీరును గుర్తిస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం విశేషం.

తనకు శుభాకాంక్షలు చెప్పిన నితిన్‌, సుధీర్ బాబు, కార్తికేయ, సత్యదేవ్‌.. వీళ్లందరికీ పవన్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. కార్తికేయని `సార్‌` అంటూ సంబోధించడం అందరికీ షాక్ ఇచ్చింది. `సార్ ఏంటి సార్‌.. మీకున్న కోట్లాది అభిమానుల్లో నేనొకడిని` అంటూ కార్తికేయ మురిసిపోతున్నాడు. `మీ ఉమామహేశ్వర సినిమా చూశాను. మీ నటన చాలా బాగుంది` అంటూ.. సత్యదేవ్‌ని విష్ చేశారు. బ్రహ్మాజీ సరదాగా విష్ చేస్తే దానికి బదులుగా అతణ్ని ‘యాక్టర్ బ్రహ్మాజీ’ అని సంబోధిస్తూ తనను తాను ‘నాన్ యాక్టర్’గా పేర్కొంటూ పవన్ బదులివ్వడం విశేషం. సంపూర్ణేష్ బాబు లాంటి చిన్న నటుడిని కూడా ‘గారు’ అని సంబోధిస్తూ బదులిచ్చారు పవన్.

ఇక బన్నీకి బదులిస్తూ.. అతను మంగళవారం మృతి చెందిన తన అభిమానులకు ఆర్థిక సాయం ప్రకటించడాన్ని ప్రశంసించారు పవన్. ఇక్కడ డబ్బులివ్వడం కంటే ఆ కుటుంబం బాధను పంచుకునే ప్రయత్నం చేయడం గొప్ప విషయమంటూ బన్నీని అభినందించారు పవన్. రవితేజకు జవాబిస్తూ.. అతణ్ని ఎప్పుడు గుర్తు చేసుకున్నా తన పెదాలపై నవ్వు విరబూస్తుందన్నారు. మంచు మనోజ్‌కు తమ్ముడు అన్న పిలుపుతో బదులిచ్చారు. ఇక తన అన్నయ్య చిరంజీవి ట్వీట్‌కు స్పందిస్తూ.. ”జీవితంలో అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు. మిగతా సినీ జనాలకే కాక.. చంద్రబాబు నాయుడు సహా రాజకీయ నేతలందరికీ కూడా పేరు పేరునా ట్వీట్ల ద్వారా ధన్యవాదాలు చెప్పి ఆశ్చర్యపరిచారు పవన్. ఇదంతా పీఆర్ టీమ్ చేస్తున్న హంగామాలా కనిపిస్తుంది. పవనే స్వయంగా ప్రతీ ఒక్కరిటీ ట్వీట్ తో సమాధానం చెబుతున్నట్టు వుంది. మొత్తానికి ఇలా రిప్లైలలో కూడా పవన్ ఓ ట్రెండ్ సృష్టించారరు పవర్ స్టార్.