దశాబ్దపు ఆదర్శ నాయకుడిగా పవన్ కళ్యాణ్

*వైసీపీ నియంతృత్వ పాలన అంతంలో పవన్ కళ్యాణ్ ది కీలకపాత్ర
*తాను చేపట్టిన ప్రతీ శాఖను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న జనసేనాని
*ప్రధాని మోదీ … ముఖ్యమంత్రి చంద్రబాబులకు చేదోడు వాదోడుగా ఉంటూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్
*ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్టెన సందర్బంగా గోడప్రతులు ఆవిష్కరించిన గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

వైసీపీ నియంతృత్వ పాలనకు తెరదించడంలో కీలకపాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి శ్రీనివాసరావు తోటలో గురువారం గోడప్రతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ఈ దశాబ్దంలో ఆదర్శ ప్రజా నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదిగారని పేర్కొన్నారు. తనపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, పంచాయతీ రాజ్, అటవీ, పర్యావరణ, గ్రామీణాభివృద్ధి, సైన్స్ & టెక్నాలజీ శాఖలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడులకు చేదోడు వాదోడుగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ, రాష్ట్రాన్ని దేశానికే స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఆళ్ళ హరి వ్యాఖ్యానించారు. ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన పవన్ కళ్యాణ్ బాటలో తాము నడుస్తుండటంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాజర్ వలి, మెహబూబ్ బాషా, కొత్తకోట ప్రసాద్, బద్రి, నండూరి స్వామి, బాలకృష్ణ, శేషు, ఉదయ్ చంద్ర, వెంకట్, బద్రిశెట్టి రాంబాబు, షంషేర్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment