రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్

దేవకట్ట దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. భారీ అంచనాలు మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. మెగాస్టార్ చేతులమీదుగా నిన్ననే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్ధమయ్యారు యూనిట్ సభ్యులు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 25 న ప్రి రిలీజ్ ఈవెంట్ జరుగనుందని తెలుస్తోంది.