గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబుపై ఎస్పీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై జిల్లా ఎస్పీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. జనసేన నాయకుడు వెంగయ్యనాయుడు ఆత్మహత్యకు కారణం అన్నారాంబాబు అని పేర్కొంటూ ఈ మేరకు పవన్ స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పవన్ స్వయంగా కోరారు.