చిల్లపల్లికి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని పిలిపించి మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయాలను, అలాగే ఎన్.డి.ఏ కూటమి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ గారి గెలుపు గురించి వివరాలను తెలుసుకొని లోకేష్ గారి విజయానికి ముందుండి నడిపిస్తున్న చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ… అలాగే అభివృద్ధి కార్యక్రమాలు గురించి కూడా తెలుసుకొని రానున్న గెలుపు కోసం మీరు చేస్తున్న మీ సేవలను జనసేన పార్టీ ఎన్నడు మరవదు అని తెలియజేశారు. ఎన్.డి.ఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఉన్నత స్థానం జనసేన పార్టీ కల్పిస్తుందని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వటం జరిగింది.