రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈ నెల 22-03-2025 రోజున ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం, ఓర్వకల్లు మండలం, పూడి చెర్ల గ్రామాన్ని సందర్శించి ఫామ్ పాండ్స్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు ఉపాధి అవకాశాలు అందించేందుకు ఉపాధి హామీ పనులను వేగంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
సభ ముగిసే ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో పర్యటిస్తానని, అలాగే రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. జనసేన నేత ఎరుకల పార్వతి మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని అన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, వారికి న్యాయం చేయడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటారని ఆమె ప్రశంసించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సహాయం అందించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారేనని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యత జనసేన కార్యకర్తలపై ఉందని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన నాయకురాలు ఎరుకల పార్వతి తెలిపారు.
Share this content:
Post Comment