రాజోలు నియోజకవర్గ పరిధిలో మూడు మండలాల అధ్యక్షులను నియమించిన పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గంలోని మూడు మండలాల జనసేన పార్టీ ముగ్గురు జనసేన సభ్యులను జనసేన పార్టీకి సిఫార్సు చేయగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలో సఖినేటిపల్లి మండలం నుండి గుబ్బల ఫణి కుమార్, మలికిపురం మండలం నుండి మల్లిపూడి సత్తిబాబు, రాజోలు మండలం నుండి సూరిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ నియమించినట్టు అధికారిక ప్రకటన రావడంతో మండల అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. మలికిపురంలోని గుండుబోగుల పెద్దకాపు నివాసం వద్ద నూతనంగా నియమించబడ్డ జనసేన పార్టీ మండల అధ్యక్షులను మలికిపురం మండలం ఎంపీపీ అయినటువంటి మేడిచర్ల సత్యవాణి రాము శాలువాతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై జనసేన పార్టీ తరఫున భరోసా ఇస్తూ ముందుకు కొనసాగుతామని 2024లో పార్టీ బలపడే విధంగా కృషి చేస్తూ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేంతవరకు కూడా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, గుబ్బల రవి కిరణ్, గుండుబోగుల పెద్దకాపు, రావూరి నాగు, పినిశెట్టి బుజ్జి, ఆనందరాజు, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.