కౌలు రైతులకు అండగా పవన్ కళ్యాణ్.. గోడపత్రికను ఆవిష్కరించిన యు.పి.రాజు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న కౌలు రైతు భరోసా యాత్రను ప్రజలలోనికి తీసుకెళ్లేందుకు భాగంగా జనసేన పార్టీ ఎన్.అర్.ఐ విభాగం జనసైనికుడు రాజా మైలవరపు ఆధ్వర్యంలోని “టీం” పిడికిలి సహకారంతో ప్రచురించిన గోడ పత్రికలను రేగిడి ఆమదాలవలస మండల నాయకులు రెడ్డి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉంగరాడమెట్ట జంక్షన్ వద్ద రాజాం నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు చేతులు మీదగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసాగా.. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 3000 (మూడు వేల ) కుటుంబాలకు పవన్ కళ్యాణ్ 30 కోట్లు తన సొంత కష్టార్జితంతో ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారని రైతులు సంక్షేమం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అని జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పించమని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాం మండల జడ్పీటీసీ అభ్యర్థి సైడాల జగదీశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల రమేష్, దుర్గారావు, ఈశ్వర్, పి.ఎ.నాయుడు తదితరులు పాల్గొన్నారు.