ప్రజల మనిషి పవన్ కళ్యాణ్: పెండ్యాల శ్రీలత

• పలు సామాజిక, సేవా కార్యక్రమాల నడుమ పండగల పవనన్న జన్మదిన వేడుకలు
• బైబిల్ మిషన్ చర్చ్ ఆశ్రమానికి అండగా ఉంటాం

అనంతపురం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం నాడు రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఉప్పరపల్లి గ్రామంలో గల బైబిల్ మిషన్ చర్చ్ సొసైటీ ఆశ్రమం నందు అనాధ విద్యార్థులకు నోట్ బుక్ లు పెన్నులు, దివ్యాంగులకు చీరలు, దుస్తులు అందించి వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేయడం జరిగింది. అనంతరం శ్రీలత మాట్లాడుతూ మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సేవా, సామాజిక కార్యక్రమాలతో నిర్వహించామన్నారని అందులో భాగంగానే ఈ ఆశ్రమానికి వచ్చి ఆనాధ, దివ్యాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగిందని, పవన్ కళ్యాణ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తరువాత అనాధ, దివ్యాంగ, వయో వృధులకు అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ ఆశ్రమంలో గతంలోకూడా మేము వారానికి ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించే వారిమని భవిష్యత్తులో కూడా ఆశ్రమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియ జేస్తు ఆశ్రమ నిర్వాహకుడు దేవదాసుని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీర మహిళలు శైలజ, లక్ష్మి, హేమలత, శ్రీదేవి, ధార్భి, యమున కుళ్ళాయమ్మ, శ్రావణి తదితరులు పాల్గొనడం జరిగింది.