జగన్మోహన్ రెడ్డి నిన్ను అధఃపాతాలానికి తొక్కేసిన మగాడు పవన్ కళ్యాణ్: బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి, జగన్మోహన్ రెడ్డి బుధవారం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సత్తెనపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పత్రికా ముఖంగా మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి… నువ్వు ఎవరో ఈ ప్రపంచానికి తెలిసేలోపే పవన్ కళ్యాణ్ కష్టపడి పవర్ స్టార్ గా ఎదిగాడు. నువ్వు రాజకీయంగా ఏ విధంగా అక్రమ సంపాదనతో, ఖూనీకోరు రాజకీయాలతో ఎలా పైకి వచ్చావో, నీ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని నువ్వు చేసిన కుటిల, నీచమైన శవ రాజకీయం అందరికి తెలుసు. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ తిరిగి ప్రజా సమస్యల మీద పోరాడి, తన కష్టార్జితాన్ని జనం కోసం ఖర్చుపెట్టి జనసేన పార్టీని జనంలోకి తీసుకెళ్లి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని 100% విజయం సాధించిన రాజకీయ దురంధరుడు. నిన్ను అధఃపాతాలానికి తొక్కుతానని మీసం మెలేసి చెప్పి మరీ నిన్ను 11 సీట్లుకి పరిమితం చేసారు. అసెంబ్లీకి రావాలంటేనే నీకు చెమటలు పట్టించేలా చేసిన పవన్ కళ్యాణ్ గురించి ఇంకా నువ్వు సైకో లాగా మతిభ్రమించి ఈ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నావు. ప్రజలు నిన్ను, నీ పిచ్చి తుగ్లక్ పరిపాలనని భరించలేక నీకు తగిన బుద్ధి చెప్పినా కానీ నీ ప్రవర్తన మార్చుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తివి, నీ స్థాయిని మరిచి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యంగ్యంగా కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అని మాట్లాడటం హేయమైన చర్య. మరి నువ్వు కోడి కత్తి కి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని సభ్యసమాజమే కోడై కూసినా నీకు బుద్ధి రాలేదు నీకు రాబోయే రోజుల్లో మా జనసైనికులు, వీర మహిళలు నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ఖబడ్దార్” అని హెచ్చరించారు.

Share this content:

Post Comment