పండగ ముందే వచ్చేసింది

లా లా భీమ్లా… అంటూ సందడి మొదలుపెట్టారు పవన్‌కల్యాణ్‌. ఆయన, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’.

సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘లాలా.. భీమ్లా’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని ఈ నెల 7న విడుదల చేస్తున్నారు. బుధవారం పాట ప్రోమోని ది సౌండ్‌ ఆఫ్‌ భీమ్లా పేరుతో విడుదల చేశారు. ‘నాగరాజు గారూ.. హార్టీ కంగ్రాచులేషన్స్‌ అండీ, మీకు దీపావళి పండగ ముందుగానే వచ్చేసిందండీ’ అంటూ పవన్‌కల్యాణ్‌ చేసిన సందడి ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్‌ సరసన నిత్యమేనన్‌, రానా సరసన సంయుక్త మేనన్‌ నటిస్తున్నారు.